ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

త్వరలో కడప జోన్‌కు 200 విద్యుత్‌ బస్సులు

కడప ఆర్టీసీ జోన్‌ ఈడీ ఆర్‌.ఆర్‌.కె.కిషోర్‌

మదనపల్లె సిటీ : ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగ్గా సేవలందించేలా చర్యలు చేపట్టినట్లు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కడప ఆర్టీసీ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఆర్‌.కె.కిషోర్‌ అన్నారు. త్వరలో కడప జోన్‌కు 200 విద్యుత్‌బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. రెండు నెలల్లో ఈ బస్సులు రోడ్డుపైకి రానున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మదనపల్లె ఆర్టీసీ–1, 2 డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక విలేకర్లతో మాట్లాడారు. అందుకు అవసరమైన ఛార్జింగ్‌ కేంద్రాలు, సబ్‌ స్టేషన్లు, సివిల్‌ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. డిపోల్లో కండక్టర్ల, డ్రైవర్లు, ఇతర సిబ్బంది కొరత వాస్తవేమన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు.

మోడల్‌ డిపోలుగా తీర్చిదిద్దుతాం

జిల్లా కేంద్రమైన మదనపల్లెను మోడల్‌ బస్‌స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ఈడీ తెలిపారు. ఇందు కోసం బస్‌స్టేషన్‌లో ప్రయాణికులకు ఆర్‌ఓ నీరు టాయిలెట్స్‌, ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు తదితర మౌళిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇందులో భాగంగా డిపోలో టాయిలెట్స్‌ను సులభ్‌ కంపెనీకి అప్పగించామన్నారు. దీంతో శుభ్రత మెరుగుపడిందన్నారు. ప్రదానంగ సమయపాలన పాటించాలన్నారు. బస్సులు కండీషన్‌గా ఉంచుకోవాలన్నారు.

సమన్వయంతో పని చేయాలి

ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఈడీ అన్నారు. గేట్‌ మీటింగ్‌లో సిబ్బందితో మాట్లాడారు. ఆర్టీసీకి ఆదాయం పెంచాలన్నారు.ప్రయాణికులతో స్నేహపూర్వంగా మెలగాలన్నారు. సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఐవిఆర్‌ఎస్‌ కాల్స్‌లో సంస్థ పనితీరు తెలుస్తుందన్నారు. సిబ్బంది పలు సమస్యలు ఈడీ దృష్టికి తెచ్చారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా పలు ఇబ్బందులను తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి శశిభూషణ్‌, డిప్యూటీ సీఎంఈ ఆర్‌ఎం నాయక్‌, ఈఈ పోతురాజు, వన్‌ డిపో మేనేజర్‌ మూరే వెంకటరమణారెడ్డి, ఎంఎఫ్‌ ఝాన్సీరాణి, యూనియన్‌ నాయకులు వినోద్‌, సీఎ బాబు, రెడ్డప్స, భయ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement