ఒంటిమిట్ట(సిద్దవటం ) : ఒంటిమిట్ట మండలం లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఏవీ వెంకటసుబ్బారావు ఒక బాలికను లైంగికంగా వేధిస్తూ, డబ్బులు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆమెను ప్రభావితం చేసి జూలై 2013 న ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా విధించినట్లు గురువారం కడప ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శాంతి తీర్పును వెలువరించారు. కడప భాగ్యనగర్ కాలనీకి చెందిన ఏవీ వెంకట సుబ్బారావు, ఒంటిమిట్ట మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఇతను బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లు బాలిక తల్లి అక్టోబర్ 2013న ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ డీకే జావిద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. అప్పటి ఎస్‌ఐ బి. పెద్ద ఓబన్న దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జి సీటు దాఖలు చేశారు. ఈ కేసులో కడప ఒకటోఅదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్. శాంతి విచారించి, ప్రాసిక్యూషన్ తరపున సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించారేఉ. నేరం నిరూపితమైనందున దోషిగా నిర్ధారించారు. సెక్షన్ 363 ఐపీసీ కింద 7 సంవత్సరాలు జైలు శిక్ష,రూ. 5000 జరిమానా, అలాగే సెక్షన్ న్366 ఐపీసీ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా విధించినట్లు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేసిన ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ అప్పటి ఎస్‌ఐ బి పెద్ద ఓబన్న, ప్రాసిక్యూషన్ తరపున వాదనలను వినిపించిన స్పెషల్ ఏపీపీ బొక్క సం శ్రీనివాసులు, గ్రేడ్ 1 శ్రీమతి ఎన్. ఖదిరుణ్, సాక్షులను సక్రమంగా కోర్టులో హాజరు పరిచి నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఒంటిమిట్ట కోర్టు కానిస్టేబుల్ నాగేంద్ర రాజు, సుమంత్, అలాగే కేసును పర్యవేక్షించిన ప్రస్తుత ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసులు, లను కడప జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.


