నేటి నుంచి తాళ్లపాకలో పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తాళ్లపాకలో పవిత్రోత్సవాలు

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

నేటి నుంచి తాళ్లపాకలో పవిత్రోత్సవాలు

రాజంపేట: శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నుంచి పవిత్రోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, వాస్తుమండలపూజ, మేధిని పూజ, మృత్సంగ్రహణం, వేదికా అర్చన, యాగశాల పూజ, అగ్నిప్రతిష్ట, బలిహరణ, హరితతో పాటు పలు పూజకార్యక్రమాలు నిర్వహించారు. 3న గురువారం పరివార దేవతలకు గ్రంధి పవిత్ర సమర్పణతో పాటు వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం పట్టుపవిత్ర సమర్పణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 4న మహాపూర్ణహుతి, కలశ ఉద్వాసన, వ్రతాచరణ, మహానివేదనం తదితర పూజకార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement