ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్‌ది ఎన్నటికీ చెరగని స్థానం | - | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్‌ది ఎన్నటికీ చెరగని స్థానం

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

వేంపల్లె : కోట్లాదిమంది తెలుగు ప్రజల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిది ఎన్నటికీ చెరగని స్థానమని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలారెడ్డి అన్నారు. బుధవారం దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు నేటికీ చెరపని ముద్ర అని, దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే అధ్యాయమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement