రాయచోటి టౌన్ : మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడన కీచక ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకన్న డిమాండ్ చేశారు. బుధవారం రాయచోటిని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంబేపల్లె మండలం శెట్టిపల్లె హరిజనవాడ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు కులశేఖర్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని ఆరోపించారు. ఈ విషయంమై స్థానికులు బహిరంగంగా నిలదీశారని తెలిపారు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం స్పందించకుండా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేష్, కుమార్, ఇర్షాద్ పాల్గొన్నారు.


