లారీని ఢీకొన్న తుఫాన్‌ వాహనం | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న తుఫాన్‌ వాహనం

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

కేవీపల్లె : ముందు వెళుతున్న లారీని తుఫాన్‌ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన మండలంలోని మఠంపల్లె క్రాస్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. తెలంగాణా రాష్ట్ర మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పంపల్లెకు చెందిన తొమ్మిది మంది తుఫాన్‌ వాహనంలో తిరుమలకు బయలుదేరారు. అయితే మంగళవారం తెల్లవారుజామున కలకడ – పీలేరు మార్గం మధ్యలో జాతీయ రహదారిలో ముందు వెళుతున్న లారీని తుఫాన్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కె.చిన్నభాస్కర్‌రెడ్డి (63) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చిన్నభాస్కర్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్‌ తెలిపారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌ : కుటుంబ సమస్యలతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మంగళవారం చౌడేపల్లి మండలంలో జరిగింది. ఘటనపై జిల్లా ఆసుపత్రి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చౌడేపల్లి మండలం పెద్ద వీడుకు చెందిన భాను ప్రకాష్‌ (30) కుటుంబ సమస్యల కారణంగా పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బాధితుడిని వెంటనే చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. చౌడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement