విడాకుల నోటీసుతో మనస్తాపం | - | Sakshi
Sakshi News home page

విడాకుల నోటీసుతో మనస్తాపం

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

మదనపల్లె టౌన్‌ : కుటుంబ కలహాలు, విడాకుల నోటీసు నేపథ్యంలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మదనపల్లెలో కలకలం రేపింది. పిటిఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన సోనియాను భర్త బాబా ఫక్రుద్దీన్‌, అత్త రాబియాబి, మామ హజ్మత్‌ వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మసీదు ద్వారా తలాక్‌ విడాకుల నోటీసు రావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. మదనపల్లె గరుడానగర్‌లోని తన చిన్నాన్న ఇంటికి వచ్చిన సోనియా సూసైడ్‌ నోట్‌ రాసి తన మూడేళ్ల కుమారుడు మహమ్మద్‌ కియాతో కలిసి పురుగుల నివారణ మందు తాగినట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇద్దరినీ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడితే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

బిడ్డతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement