నేటి నుంచి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

పులివెందుల : రాష్ట్ర మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 1వ తేదీన మంగళవారం ఉదయం 10.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి జక్కూరు ఎయిర్‌డ్రోంకు 10.50గంటలకు చేరుకుంటారు. 11గంటలకు జక్కూరు ఎయిర్‌ డ్రోం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50గంటలకు పులివెందులలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.05గంటలకు తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6గంటల వరకు తన క్యాంపు ఆఫీస్‌లో ప్రజలతో మమేకమవుతారు.

2వ రోజు పర్యటన ఇలా..

సెప్టెంబర్‌ 2వ తేదీన వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం 7గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన నేరుగా బయలుదేరి 7.45గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 8.30గంటలవరకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌ వద్ద నుంచి హెలీక్టాపర్‌ ద్వారా బెంగుళూరుకు తిరుగు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement