ఖాళీ బిందెలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో నిరసన

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

పెద్దతిప్పసముద్రం: మండలంలోని కందుకూరు పంచాయతి అగ్రహారానికి చెందిన ప్రజలు సోమవారం తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బోర్లలో నీరు అడుగంటడంతో తాము ఒక్కో బిందె నీటిని రెండున్నర రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీఓను డిమాండ్‌ చేశారు. తనతో పాటు స్పెషలాఫీసర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్య లేకుండా చేస్తామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement