ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని సాయికూటీర్ రోడ్డులో ఉన్న త్యాగరాజ రెడ్డి ఆస్పత్రి సమీపంలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి ఫిట్స్ రావడంతో ఒక్క సారిగా కిందపడిపోయి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. మృతుడి వద్ద గుర్తింపు కార్డులు లేదా ఇతర వివరాలు లభించలేదు. దీంతో మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ, కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ రామాంజనేయుడు కోరారు.


