ఎట్టెట్టా.. ఇది స్పెషల్‌ టెట్టా? | - | Sakshi
Sakshi News home page

ఎట్టెట్టా.. ఇది స్పెషల్‌ టెట్టా?

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

మదనపల్లె సిటీ: ఉపాధ్యాయుల సుదీర్ఘ డిమాండ్ల నేపథ్యంలో ఇన్‌–సర్వీస్‌ టీచర్ల కోసం ‘స్పెషల్‌ టెట్‌’ నిర్వహిస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధానంపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులలో తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం అత్యంత హడావుడిగా సాధారణ టెట్‌ పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలకు సంబంధించిన కీ మరియు తుది ఫలితాలను ఇంకా విడుదల చేయకుండానే.. వాటిని పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ ఇప్పుడు అకస్మాత్తుగా స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ను తెరపైకి తీసుకురావడంపై అయ్యవార్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

టీచర్లలో ప్రశ్నల వర్షం.. అవే సందేహాలు

ప్రభుత్వం పాత పరీక్షల పని పూర్తి చేయకుండానే స్పెషల్‌ టెట్‌ పేరిట మరో నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఉపాధ్యాయుల్లో సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టెట్‌ రాసిన ఇన్‌ సర్వీస్‌ టీచర్లు ఈ కొత్త టెట్‌కు దరఖాస్తు చేయాలా, మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాలా, లేక పాత టెట్‌ ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాలా, ఇలా అనేక రకాల సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పైగా సాధారణ టెట్‌ మాదిరిగానే అర్హత మార్కులున్నాయి, టెట్‌ వెయిటేజీ, పరీక్ష విధానంలో కూడా ఎటువంటి మార్పులూ లేవు. మరోవైపు స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌లో సైతం సాధారణ టెట్‌లో ఉన్న అంశాలే ఉండటంతో వారు అవాక్కవుతున్నారు.

మళ్లీ నిరాశే.. అడిగినదొకటి అయ్యిందొక్కటి!

ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ ఇన్‌ సర్వీస్‌ టీచర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. సాధారణ టెట్‌కు ప్రత్యేక టెట్‌కు మధ్య ఎటువంటి మినహాయింపులూ లేకపోవడంతో వారితో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు డీఏల పెండింగ్‌, మరోవైపు పీఆర్‌సీపై ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో ఇప్పటికే మండిపడుతున్న ఉపాధ్యాయులు ప్రత్యేక టెట్‌లోనూ ఎటువంటి మినహాయింపులూ ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తులవుతున్నారు. 2011కి ముందు ఉన్న ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు టెట్‌ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగష్టు 1వ తేదీ లోపు టెట్‌ ఉత్తీర్ణత కావాల్సి ఉంది. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లాలో 6 వేలకు పైగా టీచర్లకు తప్పని తిప్పలు

OÐðlGÝëÞÆŠæ hÌêÏ-ÐéÅ-ç³¢…V> 9,633 Ð]l$…¨ E´ë-«§éÅĶæ¬Ë$ {´ë£ýlÑ$MýS, {´ë£ýl-Ñ$-Mø-¯]l²™èl, E¯]l²™èl ´ëuý‡-Ô>-ÌSÌZÏ ç³°-^ól-çÜ$¢-¯é²Æý‡$. ÒÇÌZ §é§éç³# 6 ÐólÌSMýS$-Oò³V> E´ë-«§éÅ-Ķæ¬Ë$ sñæsŒæ¯]l$ Æ>Ķæ*ÍÞ E…¨. G糚yø E§øÅVýS… Ý뫨…_¯]l E´ë«§éÅ-Ķæ¬Ë$ C糚yýl$ sñæsŒæ ´ë‹Ü M>Ðé-ÌS…sôæ Mö…™èl MýSv¯]l-OÐðl$¯]l ç³Ç-íܦ-™ól¯]l° ^ðl´ëµ-Í. D ç³È„ýS 150 Ð]l*Æý‡$P-ÌSMýS$ E…r$…-¨. C…§ýl$ÌZ AÆý‡á™èl Ý뫨…-^é-ÌS…sôæ KïÜ MóSr-WÇ ÐéÆý‡$ 60 Ô>™èl…, ½ïÜ MóSrWÇ 50 Ô>™èl…, GïÜÞ, GïÜt, í³òßæ-^ŒlïÜー MóSr-WÇ ÐéÆý‡$ 40 Ô>™èl… Ð]l*Æý‡$PË$ Ý뫨…-^é-Í. AƇ$$™ól sñæsŒæ õ³ç³ÆŠ‡ &1 ´ë‹Ü M>ÐéÌS…sôæ ™ðlË$VýS$, C…XÏ‹-Ù, VýS×ìæ-™èl…, O^ðlÌŒæz yðlÐðl-ÌS-‹³Ððl$…sŒæ, ç³Æ>Å-Ð]l-Æý‡×ê-°MìS çÜ…º…-«¨…-_¯]l A…Ô>-ÌS±² ^èl§ýl-ÐéÍÞ E…r$…-¨. AÌêVóS õ³ç³ÆŠ‡&2 MýS*yé A§ól ç³Ç-íܦ-†. ºÄñæ*Ìê-hMýSÌŒæ Oòܯ]l$Þ E´ë-«§éÅĶæ¬-ÌSMýS$ VýS×ìæ-™èl…, ™ðlË$VýS$ ç³…yìl-™èl$ÌSMýS$ ÝùçÙÌŒæ çÜtyîl‹Ü CÌê çÜ…º…«§ýl… Ìôæ° çÜ»ñæj-MýS$tË$ sñæsŒæÌZ ò³sìæt ´ë‹Ü M>Ðé-ÌS…sôæ GÌê A° E´ë-«§éÅ-Ķæ¬ÌZÏ B…§øâýæ¯]l ¯ðlÌS-Mö…-¨. CÐ]l±² ÌôæMýS$…yé òܵçÙÌŒæ sñæsŒæ MìS…§ýl {ç³™ólÅMýS…V> °Æý‡Ó-íßæ…-^éÌS° E´ë-«§éÅĶæ$ çÜ…çœ*Ë$ yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æ‡$$.

ఆన్‌లైన్‌ వద్దు.. ఆఫ్‌లైనే ముద్దు!

ఆన్‌లైన్‌ విధానంలోనే టెట్‌కు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొనగా, దీనివల్ల వయసు పైబడిన ఉపాధ్యాయులు సాంకేతికంగా ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలని, పరీక్షా విధానంలో మార్పులు తేవాలని ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూటీఎఫ్‌ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సెప్టెంబర్‌ 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది. ఈ మేరకు పలు ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.

ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు ఇవే!

● విద్యాహక్కు చట్టం– 2009 సెక్షన్‌ 23(1)ను సవరించేలా కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తేవాలి.

● తమకు టెట్‌ లేకుండా చేయాలి.

● సాధ్యం కాని పరిస్థితుల్లో ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌లో సామాజిక వర్గం, కేటగిరిలతో సంబంధం లేకుండా అందరికి సమానంగా 40 శాతం పాస్‌ మార్కులు ప్రకటించాలి.

● సీనియర్‌ టీచర్లకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేనందున ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలి.

● ఏ సబ్జెక్టు టీచర్‌కు అదే సబ్జెక్టులో మాత్రమే పరీక్ష నిర్వహించాలి.

నూతన నోటిఫికేషన్‌పై ఇన్‌–సర్వీస్‌ టీచర్ల తీవ్ర ఆగ్రహం

సిలబస్‌, అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు లేకపోవడంపై ఆందోళన

సాధారణ టెట్‌ ఫలితాలు రాకుండానే మరో పరీక్ష నిర్వహణ ఏంటని ప్రశ్న

సంబంధం లేని సబ్జెక్టులతో అగ్ని‘పరీక్ష’

మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌

3న ‘చలో విజయవాడ’కు యూటీఎఫ్‌ పిలుపు

ప్రభుత్వం మాట తప్పింది

30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్‌ ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌కు అటెండ్‌ కాలేరనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాం. ఆఫ్‌లైన్‌లోనే అని చెప్పి ఆన్‌లైన్‌లోనే టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మాట తప్పింది. స్పెషల్‌ టెట్‌పై ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నాం.

– రెడ్డప్పరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు

అసెంబ్లీలో తీర్మానం చేయాలి

తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్‌ స ర్వీసు టీచర్లకు టెట్‌ లేకుండా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. స్పెషల్‌ టెట్‌ పేరుతో ఉపాధ్యాయును ప్రభుత్వం మోసగించింది.

– హేమలత, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement