బైక్‌, బస్సు ఢీ: విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌, బస్సు ఢీ: విద్యార్థి మృతి

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

సదుం : తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చీకలచేనుకు చెందిన రాజేంద్ర కుమారుడు చరణ్‌ కుమార్‌ (20) తిరుపతిలోని ఓప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితుడితో కలసి బైక్‌పై వెళ్తుండగా చంద్రగిరి వద్ద బస్సు ఢీకొనడంతో చరణ్‌కుమార్‌ మృతి చెందాడు. మృతదేహానికి సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

మోసం చేసిన దంపతుల అరెస్ట్‌

కేవీపల్లె : పలువురి వద్ద రూ. 22.20 లక్షలు మోసం చేసిన దంపతులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ శ్రీనాథపురం కాలనీకి చెందిన కురుబోతుల శంకరమ్మ, వెంకటరమణ దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురిని నమ్మించి వివిధ కారణాలతో సుమారు రూ. 22.20 లక్షలు నగదు తీసుకున్నారు. అయితే తీసుకున్న నగదు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితులు కేవీపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

నిత్యాన్నదానానికి విరాళం

రాయచోటి టౌన్‌ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కోసం రామాపురం మండలం చింతలవాండ్లపల్లె చింతల సుబ్బారెడ్డి, చింతల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,00,116లు, తిరుపతికి చెందిన నాచన రవికమార్‌,పేర్ల రవిబాబు, శఖర్‌ బాబులు ఒక్కొక్కరు రూ.7,516లు చొప్పున అందజేశారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్‌ తిరుమల మనోజ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ డీవీ రమణారెడ్డిలకు విరాళం అందజేసినట్లు వారు తెలిపారు. దాతలను ఆలయ కమిటీ వారు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement