రొంపిచెర్ల : హోం వర్కు చేయలేదని విద్యార్థిని టీచర్ కోట్టడంతో తల్లిదండ్రులు టీచర్ మీద దాడి చేసిన సంఘటన రొంపిచెర్లలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని చిన్నమశీదువీధికి చెందిన రకీబ్ అలీ ఖాన్ రెండో కుమారుడు చౌహాన్ స్థానిక ఆకాష్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం విద్యార్థి హోం వర్కు చేయలేదని టీచర్ గోపి విద్యార్థి వీపుపై కట్టెతో కొట్టాడు. దీంతో ఎర్రగా వాతాలు పడ్డాయి. సాయంత్రం ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి టీచర్‌పై దాడి చేసి కొట్టారు. అనంతరం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ మధుసూధన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను కోట్టే ఉపాధ్యాయులను పాఠశాలలో పెట్టుకోరాదని, వెంటనే టీచర్‌ను సస్పెండ్ చేయాలని అదేశించారు. దీంతో పాఠశాల యాజమాన్యం టీచర్‌ను పాఠశాల నుంచి తొలగించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు


