కడప కోటిరెడ్డి సర్కిల్ : రామలక్ష్మి పట్నాయక్ సేవలు స్ఫూర్తిదాయకమని కర్నూలు, అనంతపురం డీఐజీలు కిరణ్, విజయలక్ష్మి, కాకినాడ డీఐజీ కొనియాడారు. ఆదివారం కడప నగరంలోని ముయూర గార్డెనియాలో కడప డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ (డీఐజీ) రామలక్ష్మి పట్నాయక్ ఉద్యోగ విరమణ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ స్టాంప్‌ల శాఖలో 31 ఏళ్లు సుదీర్ఘ సేవా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. అనంతరం అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల రిజిస్ట్రార్లు ఉమామహేశ్వరి, పీవీఎన్ బాబుతోపాటు కడప సబ్ రిజిస్టార్లు అబ్దుల్ సత్తార్, హరికృష్ణ, రూరల్ సబ్ రిజిస్ట్రార్లు నజీర్, రాజశేఖర్, రెండు జిల్లాల సబ్ రిజిస్ట్రార్లు. స్టాంప్ రైటర్లు సత్కరించారు. డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, యాకోబ్, శివ, గంగాధర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.


