● ఆకాశన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు
● మూడు నెలలుగా అందని గౌరవ వేతనం, బిల్లులు
● అప్పులతో వంటావార్పునకు తప్పని కష్టాలు
మదనపల్లె సిటీ : సామాన్య,మధ్య తరగతి ప్రజలతో పాటు పాఠశాలలకు కూడా ధరల సెగ తగులుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. మన బడి–నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చింది. దీంలో పాటు విద్యార్థులకు చక్కని పౌష్టికాహారాన్ని పెట్టేది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రివర్స్ అవుతోంది. అభివృద్ధి ఆగింది. ఇక ధరల పెరుగుల ఏజెన్సీ నిర్వాహకులకు వంట భారంగా మారింది. అప్పు చేసి పిల్లలకు భోజనం చేసి పెడుతున్నా బిల్లులు సకాలంలో చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మెనూకు సంబంధించి ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.5.88లు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.8.57లు ఏజెన్సీ నిర్వాహకులకు ఇస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగినా ప్రస్తుతం ప్రభుత్వం ధరలు పెంచలేదు. మార్కెట్‌లో నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
మూడు నెలలుగా అందని గౌరవ వేతనం
మధ్యాహ్న భోజనం తయారీ ఏజెన్సీ నిర్వాహకులకు నెలకు ఇస్తున్న రూ.3000 వేలు గౌరవ వేతనం మూడు నెలలుగా ఇవ్వలేదు. భోజన బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో అప్పులు చేసి వంటావార్పు చేయాల్సి వస్తోంది. బిల్లులు ఆన్‌లైన్‌లో పెట్టామని సంబంధిత అధికారి తెలిపారు.
జిల్లాలో పాఠశాలల వివరాలు
ప్రాథమిక
పాఠశాలలు
1641
ప్రాథమికోన్నత పాఠశాలలు
152
వంట
ఏజెన్సీలు
2,669
ఉన్నత
పాఠశాలలు
459
విద్యార్థుల సంఖ్య 1,93,990 మంది


