ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

మదనపల్లి (కురబలకోట) : జిల్లాలో ఆదివారం నాలుగు కేంద్రాల్లో జరిగిన నీట్‌ పీజీ–26 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మిట్స్‌ యూనివర్సిటీ, శ్రీసాయి, బిట్స్‌, ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌, మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు పర్యవేక్షించారు. డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 747 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 717 మంది పరీక్షలకు హాజరైనట్లు నిర్వహణ అధికారులు తెలిపారు. అంతకుముందు పిల్లలకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి సెంటర్లలోకి పంపించిన తల్లిదండ్రులు.. వారు బయటికొచ్చే వరకు అక్కడే నిరీక్షించారు. పిల్లలు బయటికి రాగానే ‘బాగా రాశావా నాన్నా..’ అంటూ పలకరించే దృశ్యాలు కనిపించాయి.

నాలుగు కేంద్రాల్లో 717 మంది హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement