ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

మదనపల్లె సిటీ: ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రత్నాకర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ వర్గీకరణ పేరిట దళితులపై కుట్రలు అనే అంశంపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. గతంలో మాలమహానాడు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉండేదని, ఎస్సీ వర్గీకరణ అంశం దేశవ్యాప్త సమస్యగా మారడంతో సంస్థను రాక్స్‌ మాలమహానాడుగా విస్తరించినట్లు వివరించారు. ఉద్యమంలో భాగంగా తమిళనాడు,కర్ణాటక, కేరళ, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో పర్యటించినట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా కేవలం ఒకటి,రెండు శాతం మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, మిగిలిన 99 శాతం మంది దళితులు నేటికీ పేదరికంలోనే మగ్గుతున్నారన్నారు. ఎస్సీ జాబితాలో ఉన్న 59 కులాలకు వర్గీకరణ పేరిట లబ్ధిని సమంగా పంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. దళిత ప్రజాస్వామ్యవాదులు, సంఘ సంస్కర్తలు, ఈ వర్గీకరణ కుట్రను వ్యతిరేకించాలన్నారు. .సమావేశంలో నాయకులు ఎం.నరేష్‌, భాస్కర్‌,ఇ.రమణ, కనికెళ్ల నాని, ఎంపీ ఆనంద్‌, ఎం.మోహన్‌, డీకే నారాయణ, కె.వెంకటరమణ,లక్ష్మిపతి, కేశవ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement