పట్టణంలో ఇన్నేళ్లుగా ఉన్న స్పీడ్ బ్రేకర్లు లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని అతివేగం సరికాదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ప్రధాన కూడళ్లు, క్రాస్ రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా రాకపోకలు సాగించాలి. అవసరమైన ప్రాంతాల్లో వేగ పరిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. స్పీడ్ బ్రేకర్లు లేని సాఫీ ప్రయాణంతో పాటు భధ్రత కూడా ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
–ఎ. చాంద్ బాషా, ట్రాఫిక్ సీఐ, మదనపల్లి పట్టణం


