రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన సాయి శంకర్ స్వామి రూ.లక్ష విరాళం అందించారు. శుక్రవారం ఆలయానికి వచ్చి ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్‌కుమార్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వరంలో ఈ చెక్కును అందజేశారు. అలాగే ఓంకార్ బాబు స్వామి వారి నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.25 వేలు అందించారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి వీరి పేరున స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.


