ఖాజీపేట : కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం మల్లాయపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదట గ్రామ ప్రజలతో కలిసి భారీ కేక్‌ను కట్ చేసి వైఎస్ అవినాష్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాచమల్లు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నిస్వార్థ ప్రజా సేవకుడైన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.


