కడపలో గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

కడపలో గంజాయి పట్టివేత

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

ఐదుగురి అరెస్ట్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడప నగరంలోని మహావీర్‌ సర్కిల్‌ వద్ద అక్రమంగా గంజాయిని, అధిక ధరకు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు కడప ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.కృష్ణకుమార్‌ తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని కడప ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కడప నగరంలో మహావీర్‌ సర్కిల్‌ వద్ద గంజాయి విక్రయాలు, అమ్మకాలు సాగిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో నిఘా పెట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిలో పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామానికి చెందిన ముటమల్ల గణేష్‌, కడప నగరం బాలాజీపేటకు చెందిన అనగొండి రాజేష్‌, కడప నగరం మాసాపేటకు చెందిన కడ దాసరి చైతన్య, నాగదాసరి విజయరాజు, బీకేఎం స్ట్రీట్‌కు చెందిన కిషోర్‌ అభినందన్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 500 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు కె.నరసింహరావు, విజయ్‌ కుమార్‌, పూతలీ బాయి, హెడ్‌ కానిస్టేబుళ్లు రవి కుమార్‌, కృష్ణయ్య, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement