– డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు పిలుపు
మదనపల్లె టౌన్: నేత్రదాన పక్షోత్సవాలను విజయవంతం చేద్దామని జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ెసెప్టెంబర్ 8 వరకు జరిగే జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో బ్యానర్లు, కరపత్రాలు, ప్లెడ్జ్ కార్డులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన 6 గంటల్లోపు నేత్రాలు సేకరించాలని, ఏ వయసు వారైనా, షుగర్, బీపీ ఉన్నవారు కూడా దానం చేయవచ్చని, ఒకరి దానంతో ఇద్దరికి చూపు వస్తుందని వివరించారు. డీఐఓ డాక్టర్ ఉషశ్రీ, దేవేంద్ర, రఫీ, రహమత్ అలీఖాన్, ఆజాద్, విజయ, శోభ, సుధాకర్ రాజు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
కౌన్సెలింగ్ ప్రారంభం
కడప అర్బన్: కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చిన 37 సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెట్టామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. జమున తెలిపారు. విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్ చేస్తున్నామని వెల్లడించారు.


