మాతా శిశు మరణాలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

మాతా శిశు మరణాలు అరికట్టాలి

Aug 28 2026 1:33 AM | Updated on Aug 28 2026 1:33 AM

మదనపల్లె టౌన్‌: జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కార్యాలయంలో మాతా శిశు మరణాల నియంత్రణ కమిటీ సభ్యులు, డీఐవో డా.ఉషశ్రీతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నమోదైన మరణాలను క్షేత్రస్థాయిలో విశ్లేషించి నివారణ చర్యలపై ఆరా తీశారు గర్భిణులు, బాలింతలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

పైలెట్‌ ప్రాజెక్టుగా టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌

– డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు

తంబళ్లపల్లె: తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో వెలుగు ఎఫ్‌బీఓ కార్యాలయంలో పైలెట్‌ ప్రాజెక్టుగా టమటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు సెర్ఫ్‌ డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఎఫ్‌బీఓ సభ్యులతో నిర్వహించిన వెలుగు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌కు నిధులు సైతం విడుదలైనట్లు తెలిపారు. ఎఫ్‌బిఓ గోడౌన్‌లోనే యంత్రపరికరాలు అమర్చి విద్యుత్‌, నీటి సౌకర్యం కల్పించి మహిళలకు ఉపాధి కల్పిస్తామని వివరించారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ విజయవంతంగా నడిచేలా ఏ్‌ఫ్‌బీఏ సభ్యులు, వెలుగు సంఘాల సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌బిఓ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల సమాఖ్య అఽధ్యక్షురాలు రామలక్ష్మి, డీపీఎం గంగార్జున, రీసోర్సుపర్సన్‌ శ్రీనివాసులు, ఏపిఎం గంగాధర్‌, సీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement