వేర్వేరు ఘటనల్లో పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో పలువురికి గాయాలు

Aug 28 2026 1:33 AM | Updated on Aug 28 2026 1:33 AM

మదనపల్లె టౌన్‌ : ఇంటి స్థలం వివాదంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. మదనపల్లె తాలూకా పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. మండలంలోని రాయుని చెరువు ఒడ్డిపల్లెకు చెందిన రెడ్డెప్ప, అతని అన్న శంకరయ్యకు ఇంటి స్థలం విషయంలో వివాదం ఉంది. బుధవారం రాత్రి ఇదే విషయంలో మాటా మాటా పెరిగి ఇద్దరు కరల్రతో కొట్టుకున్నారు. గొడవను అడ్డుకున్న కుటుంబీకులు కూడా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల ఫిర్యాదులపై స్థానిక తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement