మదనపల్లె టౌన్ : ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం బుధవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికాం కాలనీకి చెందిన రమేష్ కుమారుడు భరత్(21) పని నిమిత్తం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాడు. అక్కడ పిన్ని ముగించుకుని తిరిగి బైక్ లో ఇంటికి వస్తుండగా, జడ్పీ హైస్కూల్ వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్, భారత్ బైక్ ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


