మదనపల్లె టౌన్ : బైక్ ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గడ్డంవారిపల్లెకు చెందిన కిరణ్ కుమార్ (25) బైకులో చౌడేపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా గడ్డంవారిపల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


