కురబలకోట : విద్యతో పాటు యువత క్రీడల్లో రాణించాలని క్రీడా మైదానంలో అలవడే క్రమశిక్షణ పట్టుదల, నాయకత్వ లక్షణాలు జీవితంలో విజయానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అన్నమయ్య జిల్లా స్థాయిలో ఖేలో ఇండియా–ఖేల్‌కి బాత్ విత్ పీఎం మోదీ వర్చువల్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దేశంలో యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, వేదికలు, అవకాశాలు కల్పించడంలో ఖేలో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతిభకు పదును పెట్టి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ –47 లక్ష్య సాధనలో యువతే ప్రధాన చోదక శక్తి అని పీఎం స్పష్టం చేశారు. మై భారత్ వేదిక ద్వారా యువతకు విస్రృత అవకాశాలు కల్పిస్తూ వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం లక్ష్యమని వివరించారు. ప్రధాని సందేశం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
మిట్స్‌లో ఖేలో ఇండియా..ఖేల్ కీ బాత్


