నేడు ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నేడు ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

మదనపల్లె సిటీ: జిల్లా సీనియర్‌ పురుషుల ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మురళీధర్‌ తెలిపారు. మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరంలో సాయంత్రం 4 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. క్రీడాకారులు ఆధార్‌ కార్డు జిరాక్సు, జనన ధృవీకరణపత్రం, రెండు ఫొటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు 95020 74146 నంబరు సంప్రదించాలని సూచించారు.

స్లాష్‌పై శిక్షణ

మదనపల్లె సిటీ: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్టేట్‌ లర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (స్లాష్‌)పై ఎంఈఓలు, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ 5,7,9 తరగతి విద్యార్థులకు గణితం, ఇంగ్లిషు,తెలుగులపై పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవాలన్నారు. రీసోర్సుపర్సన్లు పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్‌ అనురాధ, డీసీఈబీ సెక్రటరీ తాటిపర్తి గంగాధర్‌, ఏఎంఓ నాదిర్షావల్లి, ఎంఈఓలు రాజు, నటరాజరెడ్డి, కేశవరెడ్డి, విజయకుమారి, రెడ్డిశేఖర్‌, మునీంద్రనాయక్‌, బాలాజీ, ద్వారకనాథ్‌,హేమలత తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ పాలిటెక్నిక్‌

కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

పుంగనూరు: పుంగనూరు సమీపంలోని అగస్తీగానిపల్లె సమీపంలో ఉన్న అచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయపాలిటిక్నిక్‌ కళాశాలలో నేరుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, లేదా ఇంటర్మీడియట్‌ పాసైన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9010402068ను సంప్రదించాలని కోరారు.

నూతన ఎంపిక

వాల్మీకిపురం: విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శిగా శంకరయ్య ఎంపికయ్యారు. ఆదివారం ఏలురులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశంలో వాల్మీకిపురానికి చెందిన వలిగిరి శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తామన్నారు. విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేస్తామన్నారు.

సీఎంఎస్‌ యాప్‌కు

జాతీయ స్థాయి గుర్తింపు

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా పోలీస్‌ శాఖ రూపొందించిన కోర్టు మానిటరింగ్‌ సిస్ట మ్‌ (సిఎంఎస్‌) యాప్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆలోచనతో రూపొందించిన ఈ యాప్‌, కోర్టు సమన్లు, వారెంట్ల అమలు, సాక్షుల హాజరు పర్యవేక్షణను డిజిటలైజ్‌ చేసి పోలీసుల పనిభారాన్ని తగ్గించింది. దీనివల్ల కేసుల విచారణ వేగవంతమై, బాధితులకు త్వరగా న్యాయం అందుతోంది. ఈ విశేష సేవలను గుర్తించి రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ నిర్వహించిన టెక్నాలజీ సభా ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌–2026లో ఎస్పీ అవార్డు అందుకున్నారు. ఈ గౌరవం జిల్లా పోలీసుల సమిష్టి కృషికి దక్కిన ఫలితమని ఎస్పీ అన్నారు.

మిత్ర నోడల్‌ అధికారిగా మురళీ నాయక్‌

రాయచోటి : జిల్లాలో యువ ఆపద మిత్ర స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లాస్థాయి నోడల్‌ అధికారిగా అడ్వాన్స్‌డ్‌ స్కౌట్‌ మాస్టర్‌ మూడే మురళీ నాయక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు స్కౌట్స్‌ అండ్‌ జిల్లా చీప్‌ కమీషనర్‌ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. నియామక పత్రాన్ని మంగళవారం రాయచోటి లోని స్కౌట్‌ కార్యాలయంలో జిల్లా సెక్రటరీ నరసింహారెడ్డి మురళీనాయక్‌కు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement