ఈవీఎం గోడౌన్ల వద్ద నిరంతర నిఘా | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోడౌన్ల వద్ద నిరంతర నిఘా

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

రాయచోటి : ఈవీఎం గోడౌన్ల వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం రాయచోటి మార్కెట్‌ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్‌లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాల బియూలు, సీయూలు, వివిధ ప్యాట్‌లను అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్‌ పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్‌ సమాధానం ఇచ్చారు. రాయచోటి ఆర్డీఓ ఏ శ్రీనివాస్‌, ఎలక్షన్‌ విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement