ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె టౌన్: ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేసి వారిలో భరోసా నింపడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సోమవారం రాత్రి పోలీసు అధికారులు, సిబ్బంది ‘పల్లె నిద్ర’ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు, రక్షణ అవసరాలు, శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


