పుంగనూరు : మండలంలోని ఓబిరెడ్డిపల్లె గ్రామంలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ మహిళలు మండల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మంగళవారం మహిళలు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. గత మూడు నెలలుగా నీటి సమస్యతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. నీరు లేకపోవడంతో వ్యవసాయబోర్ల వద్ద డబ్బులతో నీటిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించాలని కోరారు.
గజ్జెలవాండ్లపల్లిలో ట్యాంకర్‌తో సరఫరా
పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతి గజ్జెలవాండ్లపల్లిలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. గ్రామ పంచాయతీ అధికారులు తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టక పోవడంతో ప్రజలంతా సోమవారం ఖాళీ బిందెలతో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యపై స్పందించిన ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ బాలచంద్రాచారి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని ప్రజలకు సూచించారు. ఈ తరుణంలో మంగళవారం ఆర్‌డబ్ల్యూఎస్ మెకానిక్ చంద్రశేఖర్ గ్రామానికి వెళ్లి ట్యాంకర్‌తో ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు.


