మదనపల్లె టౌన్ : జిల్లా డీఎంహెచ్‌ఓగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో మదనపల్లె డీఎంహెఓగా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీనరసయ్య, మదనపల్లి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవహారంపై సస్పెండైన విషయం తెలిసిందే. ఈ స్థానంలో కలెక్టర్ ఆదేశాలతో కడప జీజీహెచ్ ఆర్‌ఓగా పనిచేస్తున్న శ్రీనివాసులను ఫుల్ అడిషనల్ చార్జి డీఎంహెచ్‌ఓగా నియమించారు.
ఇన్ సర్వీసు టీచర్లు దరఖాస్తు చేసుకోవాలి
మదనపల్లె సిటీ : ఇన్ సర్వీసు టీచర్లు టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం ఓ ప్రకటన విడుదల చేశారు. 2011కు ముందు ఉద్యోగంలో చేరిన వివిధ యాజమాన్యాల కింద పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లు అక్టోబర్‌లో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించుకోవాలని తెలిపారు.
కలెక్టరేట్‌లో ప్రత్యేక బోర్డుల ఏర్పాటు
మదనపల్లి (కురబలకోట) : పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన సేవలపై ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి మదనపల్లి కలెక్టరేట్ క్యూ ఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు, పరిష్కార విధానం, పీజీఆర్‌ఎస్ సమాచారం మొబైల్ ఫోన్‌తో క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో ప్రవేశ ప్రాంతాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూ ఆర్ కోడ్ ప్రముఖంగా ఏర్పాటు చేశారు. అర్జీల స్థితిగతులు తెలుసుకోడానికి కూడా టోల్ ఫ్రీ నెంబరు 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.


