● పదే పదే అవే అర్జీలు
● సమస్య పరిష్కారంపై కాకుండా క్లోజ్ చేయడంపై అధికారుల దృష్టి
● ఆర్జీదారుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి
మదనపల్లి(కురబలకోట) : మదనపల్లి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అర్జీలు వెల్లువెత్తాయి. ఎప్పట్లాగే సమస్య పరిష్కారం కాని వారే మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చారు. సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో దూరాభారాన్ని లెక్క చేయకుండా వస్తే ఫలితం ఉండడం లేదని అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం 217 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
● పీలేరు మండలం బండ్లవంకకు చెందిన లీలా వతమ్మ వితంతు ిపింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. భర్తను కోల్పోయిన తనకు పిల్లల కుటుంబ పోషణ భారమైందన్నారు.
● కురబలకోట మండలం ఎనుములవారిపల్లికి చెందిన ఎం. వెంకట్రమణ ప్రమాదవశాత్తు చింత చెట్టు పై నుండి పడి నడవలేని స్థితిలో ఉన్నానని వృద్ధ్దాప్యలేదా వికలాంగుల ఫించన్ ఇచ్చి ఆదుకోవాలని పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు.
అక్రమాల ప్రిన్సిపల్‌పై చర్యలు ఏవీ
కురబలకోట మండలం ముదివేడు దగ్గరున్న కేజీబీవీ ప్రిన్సిపాల్ రూ.48 వేలు అక్రమంగా నిధులు డ్రా చేసి స్వాహా చేసినా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆ స్కూల్ కమిటీ చైర్మన్ డి.రెడ్డెప్ప కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారు. ఎలాంటి పనులు చేపట్టకుండా డబ్బు స్వాహా చేశారని.. దీనిపై ఆర్నెళ్లుగా అర్జీలు ఇస్తు న్నా పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు.


