పెద్దతిప్పసముద్రం : మీరు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారా, రాజకీయాలు చేస్తున్నారా, ఉద్యోగాలు సక్రమంగా చేస్తుంటే గ్రీన్ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి ఎందుకు జీతాలు పెట్టలేదంటూ జిల్లా పంచాయతి అధికారిణి (డీపీవో) రాధమ్మ కార్యదర్శి నరేష్‌పై మండిపడ్డారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆమె మండలంలో అధికారుల పనితీరు, ప్రధానంగా నెలకొన్న సమస్యలపై ఆమె ఆరా తీశారు. అనంతరం పీటీఎం పంచాయతి కార్యదర్శి నిర్లక్ష్య ధోరణిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని నువ్వు తీస్తావా, పారిశుద్య కార్మికులు కనిపించే దేవుళ్ళు, అలాంటి వారికి జనరల్ ఫండ్ నుంచి ఎందుకు జీతాలు పెట్టలేదని కార్యదర్శిని సూటిగా ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో విథులు నిర్వర్థించాలని డీపీవో సూచించారు. అనంతరం పలు గ్రామాల్లో నెలకొన్న ప్రధాన ప్రజా సమస్యలు, గ్రామ పంచాయతీల్లో నిథుల దుర్వినియోగం అయ్యాయని పలువురు డీపీవో దృష్టికి తీసుకెళ్ళగా ఆమె సానుకూలంగా స్పందించారు.
పారిశుధ్య కార్మికుల జీతాల బిల్లులు
పెట్టకపోవడంపై మండిపాటు


