కురబలకోట : జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎన్‌సీసీ కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్‌లో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన 15 మంది ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్లు ప్రతిభ కనపరచి ఏడు పతకాలు సాధించినట్లు వీసీ యువరాజ్ తెలిపారు.తెలంగాణాలోని మేడ్చల్ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో నిర్వహించిన ఈశిక్షణలో దేశ వ్యాప్తంగా పాల్గొన్న క్యాడట్లతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 0.22 రైఫిల్ ఫైరింగ్, డ్రిల్, స్కిట్ ప్రదర్సన, ఏరో మోడలింగ్ డిజైన్, పారాచూట్ శిక్షణ, డ్రోన్ పైలటింగ్ వంటి అత్యాధునిక శిక్షణ కార్యక్రమాల్లో ప్రతిభను చాటినట్లు తెలిపారు. ప్రతిభ కనపరచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. మిట్స్ క్యాడెట్లకు చాన్స్‌లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి అభినందించారు.


