పులివెందుల నృత్య దర్శకుడికి స్వర్ణ నంది అవార్డు | - | Sakshi
Sakshi News home page

పులివెందుల నృత్య దర్శకుడికి స్వర్ణ నంది అవార్డు

Jul 1 2026 2:46 AM | Updated on Jul 1 2026 2:46 AM

పులివెందుల టౌన్‌ : హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన స్వర్ణనంది అవార్డుల కార్యక్రమంలో పులివెందులకు చెందిన నృత్య దర్శకుడు సర్వన్‌కుమార్‌కు స్వర్ణ నంది అవార్డు లభించింది. సినీ నటులు ధనరాజ్‌, ప్రసన్న కుమార్‌, విమానం సినిమా దర్శకుడు శివప్రసాద్‌ల చేతుల మీదుగా సర్వన్‌కుమార్‌ అవార్డును అందుకున్నారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

ఒంటిమిట్ట : మండల పరిధిలోని మృకుండాశ్రమం సమీపంలో మంగళవారం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కడప రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 50 సంవత్సరాలు, మరణించిన వ్యక్తి గుర్తుపట్టడానికి వీలులేనంతగా గాయపడ్డాడని, లుంగీ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 9247575624, 8500226717 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement