ఒకటా రెండా ఐదు దశాబ్దాల పాటు వేళ్లూనుకుపోయిన బంధం కనుమరుగైంది. ఇన్నాళ్లు ‘తీపి’ జ్ఞాపకాలెన్నో అందించి ఇప్పుడు చేదై చేజారింది.. రైతులు.. తోతాపురి మామిడి తోటలకు మధ్య అల్లుకున్న స్నేహం చివరికి ఇలా మోడై మిగిలింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ధర నేల చూపులు చూస్తుండడంతో రైతులు తోతాపురి తోటలను తెగనరుకుతున్నారు. కోసిన కూలి కూడా గిట్టు బాటు కాక పోవడంతో ఇదిగో ఇలా కొట్టేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పులిచెర్ల మండలంలో మంగళవారం కల్లూరు సమీపంలో 50 ఏళ్ల వయస్సు ఉన్న మామిడి మానులను కోసేసిన దృశ్యమిది. – పులిచెర్ల(కల్లూరు)


