● అడవి దాటి.. అరటిపై దాడి! | - | Sakshi
Sakshi News home page

● అడవి దాటి.. అరటిపై దాడి!

Jul 1 2026 2:46 AM | Updated on Jul 1 2026 2:46 AM

● అడవి దాటి.. అరటిపై దాడి!

డవిలో విహరించాల్సిన గజరాజుల గుంపులు ఊరిమీద పడ్డాయి.. పచ్చని పంట పొలాలపై దాడి చేసి విధ్వంస రచన చేశాయి. రాత్రనక.. పగలనక.. రైతులు ఏడాదంతా పడ్డ కష్టాన్ని ఒక్క దాడిలో నేలమట్టం చేశాయి.. మంగళవారం తెల్లవారుజామున పులిచెర్ల మండలంలోని పాతపేటలో నారాయణ,నటరాజ పొలాల్లో ప్రవేశించిన ఏనుగుల గుంపు మామిడి కొమ్మలతోపాటు, అరటి తోటలను తొక్కి నాశనం చేశాయి. దీంతో కొమ్మల్లో ఉన్న కాయలు నేలరాలిపోయాయి. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అటవీశాఖ సిబ్బంది రైతులకు పంట నష్ట పరిహారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – పులిచెర్ల(కల్లూరు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement