రాజంపేట: రాజంపేట మండలంలోని నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యాసంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశపరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ గంగాథరన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 1, 2025న జరగబోయే పరీక్ష నిమిత్తం ఈ హాల్‌టికెట్లను జారీచేశామన్నారు. ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీఎస్/సీబీఎస్‌ఈడిఐటిఎంఎస్. ఆర్‌సీఐఎల్.జీవోవీ.ఐఎన్/ఎన్‌వీఎస్ లింక్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు,.
గాలివీడు: జిల్లా పరిధిలో శ్రీవాణి ట్రస్టు ద్వారా దళితవాడలు, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథం పేర్కొన్నారు. ఇందుకోసం బుధవారం పూలుకుంట గ్రామం మంగళపల్లి,రెడ్డివారి పల్లి వడ్డేపల్లిలో స్థలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా శ్రీవాణిట్రస్టు ద్వారా ఆలయాల నిర్మా ణం కోసం దరఖాస్తు చేసిన గ్రామాల్లో మొదటి దశలో స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. స్థలాల పరిశీలించిన తర్వాత దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదికలను పంపు తా మని చెప్పారు. దేవదాయ శాఖ ఏఈ రవితేజ,సర్పంచ్ పార్థసారధి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని డీఆర్‌ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలి పారు. పట్టాదారు పాసు పుస్తకాలు, మ్యుటేషన్ సేవలు పారదర్శకంగా అందించాలన్నారు. అవినీతికి తావివ్వొద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీటీ రెడ్డన్న, ఎంఆర్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
నవోదయ హాల్‌టికెట్ల విడుదల


