రైలుచక్రాలను దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైలుచక్రాలను దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి

Nov 20 2025 6:56 AM | Updated on Nov 20 2025 6:56 AM

రైలుచక్రాలను దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి

రైలుచక్రాలను దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి

రాజంపేట: రైలుచక్రాలను మన దేశంలో ఉత్తత్పి చేసుకునేలా కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ, రైల్వేబోర్డు నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ సభ్యుడు, ఇండియన్‌ రైల్వే స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన రాజంపేటలో మాట్లాడుతూ రైల్వేస్టాండింగ్‌ కమిటీ తొలి సమావేశం న్యూఢిల్లీలో జరిగిందన్నారు. తాను కూడా సమావేశంలో పాల్గొన్నట్లుగా వివరించారు. ఇప్పటి వరకు రైలుచక్రాలను(వీల్స్‌)ను చైనా దేశం నుంచి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. అలా కాకుండా మనదేశంలోనే రైల్‌వీల్స్‌ను తయారుచేసుకునేలా రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీలుకానిపక్షంలో టాటా లాంటి పెద్దకంపెనీల ద్వారా ఇనుప చక్రాలను ఉత్పత్తి చేసుకొని దిగుమతి చేసుకోవడం మంచిదనే భావనను వ్యక్తంచేశారు. అలాగే భారతీయరైల్వేలో అనేక ప్రాంతాలో వేలాది ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటన్నిటి వాడుకలోకి తీసుకురావాలన్నారు. పరోక్షంగా రైల్వేకు ఆదాయం కలిగినట్లవుతుందన్నారు.

రైలుప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి

రైలుప్రయాణికుల భధ్రతపై రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ రైల్వే స్టాండింగ్‌కమిటి సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. బోగీలలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలన్నారు. వైఫే ద్వారా సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థను తీసుకువాలని స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో కోరామన్నారు. అలాగే మధురై, విశాఖ, తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్‌తోపాటు దేశంలో ప్రధానమైన రైల్వేకేంద్రాల్లో స్టాండింగ్‌కమిటీ సమావేశాలు నిర్వహించి, అక్కడి నుంచి రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సంక్షమేం, తదితర అంశాల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. తదుపరి సమావేశంలోప్రాధాన్యత క్రమంలో రైల్వేపరమైన అంశాలను గుర్తించి ప్రస్తావించి, సాధించుకునేందుకు కృషి చేయనున్నట్లు మేడా రఘునాథరెడ్డి వివరించారు.

రైల్వేకోచ్‌లో సీసీ కెమెరాలఏర్పాటు తప్పదు

ఇండియన్‌ రైల్వేస్టాండింగ్‌కమిటీ సభ్యుడు మేడా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement