● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?
గుర్రంకొండ: ఖరీఫ్‌సీజన్ ప్రారంభమైంది. వ్యవసాయపనులు ముందుకు సాగడం లేదు.ఎరువుల కొరతే దీనికి కారణం. అంతేకాకుండా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద ధరలు, స్టాకు వివరాలుగానీ తెలియజేసే సమాచార బోర్డులు లేక పోవడం గమనార్హం. కాగా రైతులు కొనుగోలు చేసే ఎరువులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఈక్రమంలో అన్నదాత అవసరాన్ని, నిస్సహాయతని ఆసరాగా తీసుకొని నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులను అంటగట్టే అవకాశం లేకపోలేదు. రైతులను కాపాడేందకు విత్తనచట్టం ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో రైతుల పరిస్థితి కొనబోతే కొరివి ఆమ్మబోతే అడవి అన్నచందనంగా మారింది.
నెలరోజులుగా ఇదే పరిస్థితి..
జిల్లాలోని 452 రైతుసేవాకేంద్రాల్లో నెలరోజులుగా ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.కొన్ని కేంద్రాల్లో ప్రస్తుతం పొటాష్, జిప్సమ్ మాత్రమే అందుబాటులో ఉంచారు. మరికొన్ని కేంద్రాల్లో వాటితోపాటు మిగిలిన ఎరువులు 40 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. వర్షాలు సమృద్ధిగా కరుస్తుండడంతో జిల్లాలోని రైతులు వేరుశనగ, ఇతర ఆరుతడిపంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పొలాలను దక్కులు చేసుకొని విత్తనాల కోసం వేచిచూస్తున్నారు. పలువురు రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి సాగుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎరువులు మాత్రం అంతంత మాత్రంగానే అందుబాటులో ఉండడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌సీజన్ ప్రారంభానికి ముందే అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాల్లో డీఎఫీ, కాంప్లెక్స్‌లు. యూరియాల స్టాకు అంతంతమాత్రమే.
ప్రైవేట్ డీలర్ల నిలువుదోపిడీ
జిల్లాలో రైతులను ప్రైవేట్ ఎరువుల దుకాణాల డీలర్లు ఇష్టారాజ్యంగా నిలువుదోపిడీ చేస్తున్నారు.రైతుసేవాకేంద్రాల్లో అంతంతమాత్రంగానే ఎరువులు ఉండడంతో రైతులు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించి డీలర్లు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తూ దోచుకొంటున్నారు. కొనుగోలుచేసిన ఎరువులు, పురుగుల మందులకు రశీదులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులను మోసగిస్తున్నా చర్యలేవీ..
ప్రైవేట్ డీలర్లు ఇష్టానుసారం రైతులను మోసగిస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. విత్తనాలు, కొనుగోలు సమయంలో విత్తన చట్టం ద్వారా సంబంధిత విత్తనాల డీలర్లపై కఠిన చర్యలు చేపట్టే వీలుంది. విత్తన చట్టం 1966, విత్తన నిబంధనలు1968, విత్తన నియంత్రణ–1983 చట్టాల ఆధారంగా అతిక్రమణలు, ఉల్లంఘనలు వర్తించేలా చట్టాన్ని రూపొందించారు. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడే వారిపై విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 క్లాజ్ 3 కింద నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయా దుకాణాల్లో విత్తనాలను జప్తు చేయడంతో పాటు అత్యవసర సరకుల చట్టం 1955 సెక్షన్–ఎ ప్రకారం జరిమానా విఽధించాలి. ఇన్ని చట్టాలు ఉన్నా అధికారులు మాత్రం అమలు చేయడంలో మీన వేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ పంటలు బాగా పండాలంటే సాగునీటితో పాటు ఎరువులూ కీలకమే. సకాలంలో వాటిని వేయకపోతే పంట ఎదుగుదల, దిగుబడి నాణ్యతపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో అరకొర నిల్వలు ఉన్నాయి. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ఎరువుల దకాణాల యజమానులు రైతులు ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారు.
ఖరీఫ్ ప్రారంభమైనా రైతుసేవా కేంద్రాల్లో అరకొర నిల్వలు
రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఎరువుల దుకాణా యజమానులు
షాపుల ముందు కనిపించని ధరల సమాచారం బోర్డులు
అధిక ధరలకు విక్రయిస్తున్నారు
ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో డీలర్లు పురుగుల మందులు, ఎరువులను ఆఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. అసలే పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటుధరలు లేవు. మరోవైపు ఎరువుల దుకాణాల యజమానులు ఇష్టానుసారంగా ఎక్కువ ధరలకు అమ్ముతూ రైతుల్ని దోచుకొంటున్నారు. ఎరువుల కోసం వ్యయ ప్రయాసలు పడుతున్నాం. – నరసింహులు, రైతు, కొత్తపల్లె
ఎరువులు అందుబాటులో లేవు
రైతు సేవాకేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో లేవు. జిప్సం, పొటాష్ మాత్రమే ఇస్తున్నారు. డీఏపీ, యూరియా వంటి అవసరమైన ఎరువులు ఇవ్వడం లేదు. ఖరీఫ్‌సీజన్ పంటలు సాగు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నాం. అవసరమైన అన్ని రకాల ఎరువులు అందుబాటు ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. –రమణమ్మ, రైతు, గుట్టకిందపల్లె
జిల్లాలో సూమారు 484 ప్రైవేట్ ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 187 విత్తన విక్రయ డీలర్లు కాగా మిగిలిన దుకాణాల్లో ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తుంటారు. నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేట్ ఎరువుల, విత్తనాల విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా విత్తన లైసెన్స్‌లను ప్రదర్శించాలి. లేకుంటే నోటీసులు ఇచ్చి దానికి సరైన సమాధానం ఇవ్వక పోతే విత్తననియంత్రణ ఉత్తర్వులు 1986 క్లాజ్–5 ప్రకారం డీలర్ లైసెన్స్ రదు చేయడానికి వ్వవసాయాధికారులకు పూర్తి అధికారం ఉంది. అలాగే విత్తనాలు విక్రయించే దుకాణాల్లోనూ, దుకాణం ముందు వైపు కచ్చితంగా ధరలు, స్టాకుల సమాచారాన్ని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలి.లేకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజ్ 8 ప్రకారం ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. విత్తనాల కొనుగోలు సమయంలో రైతులకు తప్పనిసరిగా డీలర్లు రశీదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే విత్తననియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజ్ 9 ప్రకారం డీలర్‌కు నోటీసు ఇచ్చి సమాధానం చెప్పక పోతే లైసెన్స్ రద్దు చేయవచ్చు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం 1966సెక్షన్–7 ప్రకారం విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 క్లాజ్ 8–ను అనుసరించి డీలర్ లైసెన్స్ రద్దు చేస్తారు. రైతుల సంక్షేమం కోసం ఇన్ని చట్టాలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు.
● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?
● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?
● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?
● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?
● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?
● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడా?


