భర్తతో పాటు ప్రియుని గుడికి పిలిచిన భార్య.. | Sachivalayam Women Police Husband Ends Life In Proddatur - Sakshi
Sakshi News home page

ప్రియుడు.. భర్త.. మధ్యలో భార్య.. ఏం జరిగిందంటే..

Oct 26 2023 7:44 AM | Updated on Oct 26 2023 4:04 PM

- - Sakshi

ప్రేమలలిత ఏడాది నుంచి అదే ప్రాంతానికి చెందిన పబ్బతి శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ప్రొద్దుటూరు క్రైం : వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను తీసింది. రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డి(33)కి కడపకు చెందిన ప్రేమలలితతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె సచివాలయంలో జీఎంఎస్‌కే ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు అక్కడే నివాసం ఉంటున్నారు.

ప్రేమలలిత ఏడాది నుంచి అదే ప్రాంతానికి చెందిన పబ్బతి శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు మందలించినా ఆమెలో మార్పు రాలేదు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఈనెల 23న రాత్రి దంపతులిద్దరూ శివాలయం వద్దకు వెళ్లారు. భార్య పక్క న పబ్బతి శ్రీను ఉండటాన్ని చూసిన శివశంకర్‌రెడ్డి అతన్ని వెంబడించాడు.

అతన్ని పట్టుకొని సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. తర్వాత భార్య ప్రేమలలిత, పబ్బతి శ్రీను, తీట్ల రాజా అనే వ్యక్తులు అతనికి ఫోన్‌ చేసి సెల్‌ఫోన్‌ ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన అతను మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement