
దుంగలతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది
రైల్వేకోడూరు : నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఫ్‌ఆర్‌వో రఘునాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గాదెల సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని చూసి కొందరు ఎర్రచందనం దుంగలను వదిలేసి, పరారయ్యారు. అక్కడున్న 6 ఎర్రచందనం దుంగలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్‌ఆర్‌వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వో మహేష్‌కుమార్, ఎఫ్‌బీవో దేవేంద్రరెడ్డి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.