YSRCP MP Vijayasai Reddy Complaint On TDP False Propaganda - Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు

Apr 8 2022 7:40 PM | Updated on Apr 9 2022 7:25 AM

YSRCP MP Vijayasai Reddy Complaint On TDP False Propaganda - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ రుషికొండ భూకబ్జాల పేరిట విమర్శలపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈనాడు అధినేత రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్‌నాయుడుపై ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారంతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఈస్ట్‌ ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనుపై కూడా ఫిర్యాదు చేశారు.

చదవండి: వాళ్ల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్‌

‘‘టీడీపీ అక్రమార్కులపై చర్యలు తప్పవు. రెండేళ్లలో 10 వేలకోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకున్నాం. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెడతాం. రామోజీరావు ఆర్థిక నేరగాడు. ఫిల్మ్‌సిటీ పేరిట భూములు మింగేశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ లీలలన్నీ ప్రజలకు తెలుసు. రుషికొండ ఎన్‌సీసీ భూముల వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ భూముల కేటాయింపు మా ప్రభుత్వ హయాంలో జరగలేదని’’ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement