ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి టాప్‌లో నిలిచారు. ఏపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల్లో మేడా రఘునాథరెడ్డి ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో అగ్రస్థానాన్ని సాధించారు
తనకు కేటాయించిన నిధుల్లో 55.17 శాతం అభివృద్ధి పనులకు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఖర్చు పెట్టారు. గ్రామాలలో సిసి రోడ్ల పనులకు అత్యధికంగా నిధులను ఖర్చుపెట్టారు. 14.7 కోట్ల రూపాయల నియోజకవర్గ నిధుల కేటాయింపులలో 8.10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 139 ప్రాజెక్టులకు సిఫారసు చేయగా 110 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 29 పనులు కొనసాగుతున్నాయి.
ఇక నాలుగో స్థానంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి నిలిచారు. తనకు కేటాయించిన నిదుల్లో ఇప్పటివరకూ 48.94 శాతం నిధులను వినియోగించారు. ఇక తను కేటాయించిన ఎంపీ నిధుల్లో 35.71 శాతం ఖర్చుపెట్టిన ఏడో స్థానంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి నిలిచారు. ఈ జాబితాలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అట్టడుగు స్థానంలో నిలిచారు. తనకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వర్మ. ఎంపీ ల్యాడ్స్ నిధులపై ఎంపవర్డ్ ఇండియన్ నివేదిక ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.


