
సాక్షి, తాడేపల్లి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కీలక ప్రకటన చేశారు. తాము కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించబోమన్నారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు. కులాలు, మతాల మీద వివక్ష చూపటం కరెక్టు కాదు. వైఎస్సార్‌సీపీకి అన్ని వర్గాలూ ముఖ్యమే.
.. అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ సీఏఏ తెచ్చిన బీజేపీతో కలవటం కరెక్టు కాదు. ప్రజలు దీనికి సరైన సమాధానం చెప్తారు’ అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.