పిచ్చి పట్టినట్లు మాట్లాడొద్దు..

YSRCP MLA Dwarampudi Chandrasekhar Reddy Firs On Chandrababu - Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపాటు

సాక్షి, కాకినాడ: అమరావతిని ఏక రాజధానిగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పదవి లేదని పిచ్చి పట్టినట్లు మాట్లాడొద్దు. మీ వయస్సుకు, అనుభవానికి తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించాలి. అమరావతిపై సెంటిమెంట్ ఉంటే.. వెంటనే మీ ఎమ్మెల్యేలతో సహా మీరు పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి. గతంలో తెలంగాణ సెంటిమెంట్ ఉండబట్టే కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారని’’ ఆయన  గుర్తు చేశారు. (రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్ర హోంశాఖ)

తమ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అడగడానికి మాత్రమే అర్హులని, తమకు రెఫరెండం, డెడ్‌లైన్లు విధించడానికి మీరెవ్వరని చంద్రబాబును దుయ్యబట్టారు. మూడు రాజధానులు రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగమని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top