YSR Lifetime Achievement Awards 2022 Announced, Check Winners Details - Sakshi
Sakshi News home page

30 మంది దిగ్గజాలకు ప్రభుత్వ పురస్కారాలు

Oct 14 2022 6:20 PM | Updated on Oct 15 2022 7:51 AM

YSR Lifetime Achievement Awards 2022 Announced - Sakshi

సాక్షి, అమరావతి: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, డాక్టర్‌ వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌–2022 పురస్కారాలకు ఎంపికైన దిగ్గజాల జాబితా విడుదలైంది. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన విశిష్ట వ్యక్తులు, సామాజిక సేవ రంగంలోని వివిధ సంస్థలకు కలిపి 30 అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌), అవార్డుల హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్‌ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 1న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. 
చదవండి: అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు

మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ప్రతిబింబించేలా ప్రజా సేవకు కృషి చేస్తున్న వారిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అవార్డులకు ఎంపిక చేశామన్నారు. మన గ్రామం, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన మాట, భాష వంటి అంశాలను ప్రమాణికంగా తీసుకున్నామన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా అవార్డులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయానికి 5, సంస్కృతి–సంప్రదాయాలకు 5, మహిళా సాధికారత, రక్షణకు 3, సాహిత్య సేవ రంగానికి 3, విద్యా రంగానికి 4, పత్రికా రంగానికి 4, వైద్య రంగానికి 5, పరిశ్రమ రంగంలో ఒక అవార్డును ఇస్తున్నామన్నారు. 20 మందికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, 10 మందికి అచీవ్‌మెంట్‌ వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారాలను 20 మందికి, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారాలను 10 మందికి ఇవ్వనున్నట్టు కృష్ణమోహన్‌ తెలిపారు.

లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక.. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపికలను అందజేస్తామన్నారు. దిశ పోలీసింగ్‌ విభాగంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితులను కాపాడిన ఐదుగురు పోలీసులకు ఉమ్మడిగా అవార్డులను ఇస్తున్నామన్నారు. సమాచార శాఖ కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామన్నారు. 

- వ్యవసాయం (అందరికీ వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)
1. ఆదివాసీ కేజూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ (సోడెం ముక్కయ్య, బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా)
2. కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ (ఎ.గోపాలకృష్ణ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా)
3. అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (జయబ్బ నాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా)
4. అమృతఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ, కేఎల్‌ఎన్‌ మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా)
5. కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా 

- కళలు–సంస్కృతి
1. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌)
2. ఆర్‌.నారాయణమూర్తి  (వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌)
3. సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)
4. పెడన కలంకారీ నేతన్న పిచుక శ్రీనివాస్‌ (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)
5. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్‌ కట్లరీ షేక్‌ గౌసియా బేగం (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)

- సాహిత్య సేవ (వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌)
1. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
2. ఎమెస్కో పబ్లిషింగ్‌ హౌస్‌ విజయకుమార్‌ 
3. రాయలసీమ ప్రసిద్ధ రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ 

- మహిళా సాధికారత–రక్షణ 
1) ప్రజ్వలా ఫౌండేషన్‌ సునీతా కృష్ణణ్‌ (వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌)
2) ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌ (వైఎసాŠస్‌ర్‌ లైఫ్‌టైమ్‌)
3) దిశ పోలీసింగ్‌–రవాడ జయంతి, ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజరత్తయ్య, పి.శ్రీనివాసులు (ఉమ్మడిగా వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు)

- విద్యా రంగం 
1. మదనపల్లి–రిషీ వ్యాలీ విద్యా సంస్థ (వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌)
2. కావలి–జవహర్‌ భారతి విద్యాసంస్థ (వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌)
3. వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరాం (వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌)
4) బ్యాంకింగ్‌ రంగంలో వేలాది మందికి దారి చూపిన నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డి (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌)

- జర్నలిజం (అందరికీ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌)
1. బండారు శ్రీనివాసరావు
2. సతీష్‌చందర్‌
3. మంగు రాజగోపాల్‌
4. ఎంఈవీ ప్రసాదరెడ్డి

- వైద్య రంగం (అందరికీ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌)
1. డాక్టర్‌ బి.నాగేశ్వరరెడ్డి, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 
2. డాక్టర్‌ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్‌ (హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌) 
3. భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృషాŠణ్‌ ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవాక్సిన్‌)
4. అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి
5. గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌

- పారిశ్రామిక రంగం (లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌)
గ్రంథి మల్లికార్జునరావు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్త. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement