మనబడి నాడు–నేడు: నేడు తూర్పు గోదావరికి సీఎం జగన్‌

YS Jagan Visits East Godavari To Launch 2nd Phase Nadu Nedu august 16th - Sakshi

సర్వహంగులూ సమకూర్చుకున్న సర్కారు స్కూళ్లు

నేడు విద్యార్థులకు అంకితం చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

తొలివిడత కింద రూ.3,669 కోట్ల వ్యయంతో 15,715 

ప్రభుత్వ స్కూళ్ల ఆధునికీకరణ

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్లో కార్యక్రమం

రెండో విడత నాడు–నేడు పనులకూ అక్కడే శ్రీకారం

విద్యాకానుక కింద పిల్లలకు స్టూడెంట్స్‌ కిట్లు పంపిణీ కూడా ప్రారంభం

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడే సామర్థ్యాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విద్యార్థుల్లో నెలకొల్పుతున్నారు. వారిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతూ అత్యుత్తమ మానవ వనరుల తయారీయే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వారి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. తొలివిడత పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ వేదికగా నిలుస్తోంది. దీంతోపాటు నాడు–నేడు రెండో విడత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.  దీంతోపాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రారంభిస్తారు.

సీఎం పర్యటన ఇలా..
సీఎం జగన్‌ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు.  
 11 గంటలకు పి.గన్నవరం మండలం పోతవరం చేరుకుంటారు.
 అక్కడినుంచి పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు.  తొలి విడత పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించిన అనంతరం.. రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు  సీఎం శ్రీకారం చుడతారు. 
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ప్రారంభిస్తారు. 8 పాఠశాల వద్ద ఉన్న భవిత కేంద్రం, గ్రంథాలయం, లేబొరేటరీలు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను జగన్‌ సందర్శిస్తారు. 
 విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటుచేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. టాయిలెట్లను పరిశీలిస్తారు. అనంతరం నాడు–నేడు పైలాన్‌ను ఆవిష్కరించి, పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 మ. 1.30 గంటలకు పోతవరం నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


 


ఇది తూర్పుగోదావరి జిల్లా 
పి.గన్నవరంలోని శింగంశెట్టి ప్రభావతి జెడ్పీ ఉన్నత పాఠశాల. ‘నాడు–నేడు’ ద్వారా ఆధునికీకరించిన పాఠశాలలను సీఎం వైఎస్‌ జగన్‌ నేడు ఈ స్కూలు వేదికగా ప్రారంభిస్తున్నారు. 1970లో ఏర్పాటైన ఈ పాఠశాలలో మొత్తం 25 గదులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు ఉండేవి కావు. తాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే. పాఠశాల గదుల్లో విద్యుత్‌ సౌకర్యం మాటేలేదు. పెచ్చులూడిపోయిన ఫ్లోరింగ్‌తో విద్యార్థులు నానా అవస్థలు పడేవారు. నాడు–నేడు కార్యక్రమం వల్ల 749 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రూ.64 లక్షల వ్యయంతో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రతి తరగతి గదికి నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు, టైల్స్‌తో ఆకర్షణీయంగా ఫ్లోరింగ్‌ను తీర్చిదిద్దారు. మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు.ఆధునిక హంగులతో మరుగుదొడ్లు నిర్మించారు. లైబ్రరీ, ఆధునిక ల్యాబ్‌ ఏర్పాటు చేశారు.


 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top