ఆసరా మహిళలకు పశువుల పంపిణీ ప్రారంభం

YS Jagan Inaugurates YSR Cheyutha And Distribution Of Cattle To Women - Sakshi

అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి

ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లోని 400 గ్రామాల్లో ప్రారంభం

రూ.6,551 కోట్లతో పాలసేకరణ కేంద్రాలు, బల్క్‌ కూలింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్లు

అమూల్‌తో ఒప్పందం రైతులకు మేలు

లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుంది

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దీంతో పాటు అమూల్‌ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. మార్కెట్‌లో పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అమూల్‌తో ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్‌ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. చదవండి: తొలిరోజే రూ.1,412 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ

ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేస్తారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top